బోనకల్ మండలంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

Thursday, 31 Jan, 3.47 am

నవతెలంగాణ-బోనకల్‌
బుధవారం జరిగిన మూడో విడత పంచా యతీ ఎన్నికలు బోనకల్‌ మండలంలో ప్రశాతంగా ముగిశాయి. మొత్తం 22గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మండలంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
ఏడు పంచాయతీల్లో సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపు.. :
మండల వ్యాప్తంగా మొత్తం ఏడు పంచాయ తీల్లో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు గెలిచా రు. తూటికుంట్ల, నారాయణపురం, చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి, మోటమర్రి, ఆళ్లపాడు గ్రామపంచా యతీల్లో గెలుపొందారు.
ఓటమి పాలైన మాజీ సర్పంచ్‌లు : మండలంలో ముగ్గురు మాజీ సర్పంచ్‌లు ఓటమి పాలయ్యారు. చిరునోములలో 4వ వార్డు నుంచి పోటీ చేసిన శాఖమూరి రాజశేఖర్‌ ఓటమిపాలయ్యాడు.